ఏటూరునాగారం, జనవరి 16 : ఏటూరునాగారంలో ఏఎస్పీ మనన్‌భట్ ఎదుట గురువారం ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. ఏఎస్పీ కథనం ప్రకారం.. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ‘పోరు కన్నా ఊరు మిన్న.. మన ఊరికి తిరిగి రండి’ అనే నినాదంతో అవగాహన కార్యక్రమం చేపట్టారు. దీని ఫలితంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మద్దేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంగినిపార పంచాయతీకి చెందిన కడియం పాండు, టెర్రమ్ పోలీసు స్టేషన్ పరిధిలోని పెద్ద భట్టిగూడెం గ్రామానికి చెందిన ముచకి మంగళ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరు మద్దేడు ఏరియా కమిటీ ఆకాశ్ టీమ్‌లో పనిచేశారు. సరెండర్ పాలసీలో భాగంగా వీరికి రూ.25వేల చొప్పున పునరావాస ఆర్థిక సాయం అందజేశారు.