కొత్తగూడెం క్రైం, మే 29 : ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య భీకరపోరు జరిగింది. ఈ పోరులో ఓ మహిళా మావోయిస్టుతోపాటు మరో దళసభ్యుడు మృతిచెందిన ఘటన బీజాపూర్ జిల్లాలో బుధవారం జరిగింది. బద్దెపారా అడవుల్లో మావోయిస్టులున్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడి జవాన్లపై కాల్పులు జరిపారు. తిరిగి జవాన్లు కాల్పులు జరపడంతో మావోయిస్టులు అడవిలోకి పారిపోయారు. ఇరువర్గాల మధ్య సుమారు 20 నిమిషాలపాటు భీకరపోరు జరిగినట్టు తెలుస్తున్నది.