రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో(Rajanna Siricilla) విషాదం చోటు చేసుకుంది. జిల్లాలో కురిసిన భారీ వర్షానికిపిడుగు పడి(Lightning strike) ఇద్దరు వ్యక్తులు మృతి(Two killed) చెందారు. తంగళ్లపల్లి మండలం భరత్‌నగర్‌లో పిడుగుపాటుకు రామడుగు చంద్రయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. అలాగే వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజ్పల్లిలో కంబాల శ్రీనివాస్ మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కాగా, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలకు రహదారుల పక్కన చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల ఇండ్ల పైక్కులు గాలికి కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
