న్యూఢిల్లీ, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావుకు శాశ్వత న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సీజేఐ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం.. ఫిబ్రవరి 13 న తెలంగాణ హైకోర్టు కొలిజీయం చేసిన సిఫారసులపై సంతృప్తిని వ్యక్తం చేసింది.