పెద్దపల్లి: జిల్లాలోని రామగుండంలో (Ramagundam) ఓ లారీ బీభత్సం సృష్టించింది. రామగుండంలోని బీ-పవర్ హౌస్ వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. దీంతో ఇంట్లో ఉన్న దంపతులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు వారిని దవాఖానకు తరలించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన లారీని సీజ్‌చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కారు దగ్ధమయింది. బూర్గపాడు మండలంలోని సారపాక పెట్రోల్ బంకు వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంధి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమయింది.