మల్లాపూర్, సెప్టెంబర్ 19: పంటల రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలకు తగిలి ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామానికి చెందిన జెల్ల పెద్ద ముత్తన్న (60) పొలంలో మందు చల్లేందుకు వెళ్లారు. పక్కనే రత్నాపూర్ గ్రామానికి చెందిన గొండ సాయన్న తన మక్క చేనును కోతుల బెడద నుంచి కాపాడుకునేందుకు ఇనుప కంచె ఏర్పాటు చేసి, మోటారు నుంచి అక్రమంగా కరెంట్ పెట్టాడు.
పెద్ద ముత్తన్న ప్రమాదవశాత్తూ ఇనుప కంచెకు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ముత్త న్న భార్య జెల్ల పెద్దరాజు ఫిర్యాదు మేరకు సాయన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండ లం పత్తిపాకకు చెందిన రైతు దయ్యాల రాయమల్లు (56) పొలానికి నీళ్లు పె ట్టేందుకు ఉదయం వెళ్లాడు. పక్క పొలానికి చెందిన రైతు కర్నె రాములు ఇనుప వైర్‌తో కంచెను ఏర్పాటు చేసి, కరెంట్ కనెక్షన్ ఇచ్చాడు. రాయమల్లు ఆ తీగలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.