దుబ్బాక, అక్టోబర్ 18 : అప్పుల బాధతో యువ రైతు పురుగుల మం దు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. దుబ్బాక పట్టణానికి చెందిన జమునగారి ప్రవీణ్ (33) వ్యవసాయంతోపాటు వరి కోత యంత్రం డ్రైవర్గా పనిచేస్తూ.. భార్య, ఇద్దరు పిల్లలతోపాటు తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు. సాగుకోసం బోరు బావులు తవ్వించాడు. ఆశించిన మేర దిగుబడులు రాకపోవడంతో సుమారు రూ.10 లక్షల వరకు అప్పులయ్యా యి. ఓ పక్క వ్యవసాయానికి చేసిన అప్పులు పెరిగిపోవడం, మరోపక్క కుటుంబ పోషణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో ప్రవీణ్ శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నా డు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు దుబ్బాక ఎస్సై కీర్తిరాజు తెలిపారు.