Telangana | రైతులను వేధిస్తున్న ఇద్దరు విద్యుత్ శాఖ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. లంచం తీసుకుంటు నల్లగొండ జిల్లాలో ఒకరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకరు పట్టుబడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం మద్దికొండ గ్రామంలో కొనకళ్ల ఆదిత్య అనే రైతు విద్యుత్ కనెక్షన్‌కు సంబంధించి ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఇందుకోసం ఏఈ శరత్ కుమార్ లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వలేని రైతు.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఏఈ శరత్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అశ్వారావుపేట సబ్‌స్టేషన్‌లో సోదాలు నిర్వహించారు.
మరోవైపు నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మల్లారెడ్డికి చెందిన సూర్యానారాయణ అనే రైతు తన పొలంలో నుంచి విద్యుత్ స్తంభాలు, వైర్ లాగేందుకు లైన్‌మన్ వేణు రూ.50వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో సదరు రైతు నుంచి 20వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.