జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మండలంలోని గొట్టిగార్‌పల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి జిల్లా దవాఖానకు తరలించారు.
మృతులను జహీరాబాద్ మండలం అర్జునాయక్ తాండాకు చెందిన రాథోడ్ శంకర్, పవన్‌గా గుర్తించారు. జహీరాబాద్ నుంచి సిద్ధాపూర్ తాండాలోని తమ బంధువుల ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.