జనగామ: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మరణించారు. నర్మెట్ల మండలం గుంటూరుపల్లి వద్ద బైకు అదుపుతప్పి యువకుడు మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మరొకరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని తరిగొప్పుల మండలం అంకుశాపూర్కు చెందిన స్వామిగా గుర్తించారు.
ఇక రఘునాథపల్లి వద్ద ఆగివున్న లారీని ఓ బైకు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. అతడిని జనగామకు చెందిన కొత్తపల్లి రవీందర్గా గుర్తించారు. ఈ రెండు ఘటనలపై కేసులు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.