సంగారెడ్డి : కాంగ్రెస్ పాలనలో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. సాగు, తాగు నీరు ప్రజలు అల్లాడిపోతున్నారు. బిందెడు మంచినీళ్లు మైళ్లదూరం ప్రయాణించాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా(Sangareddy district) నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేట్లో గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన పలువురు మిషన్ భగీరథ నీరు రాక, బావిలోని నీరు తాగారు. కలుషిత నీరు(Contaminated water) తాగడంతో ఇద్దరు మృతి(Two died) చెందగా 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఒకరిని సంగారెడ్డి హాస్పిటల్కు, ఇద్దరిని నారాయణఖేడ్ ప్రభుత్వ దవాఖానకు తరలిచారు. బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దారుణం.. మిషన్ భగీరథ నీరు రాక, కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావు పేట గ్రామంలో మిషన్ భగీరథ నీరు రాక, బావిలోని నీరు తాగిన రెండు బీసీ కాలనీలకు చెందిన ప్రజలు.
కలుషిత నీరు కావడంతో ఇద్దరు మృతి.. 50 మందికి తీవ్ర అస్వస్థత.
మరో ముగ్గురు… pic.twitter.com/di7siv2eaD
— Telugu Scribe (@TeluguScribe) October 13, 2024