హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తేతెలంగాణ): బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులపాటు మోస్తారు వర్షాలు కురువొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల మోస్తారు వర్షాలు కురిశాయని వెల్లడించింది. నల్లగొండ జిల్లా మాటూరులో 1.1 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 1.1 సెంటీమీటర్ల వర్షం కురిసిందని తెలిపింది. ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.