బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 23, 2020 , 02:04:28

2 కోట్ల సెల్‌ఫోన్లు కొట్టేశారు

2 కోట్ల సెల్‌ఫోన్లు కొట్టేశారు

  • వెల్దుర్తి మండలం మాసాయిపేట దాబా వద్ద ఆగిన కంటైనర్‌ నుంచి దోపిడీ
  • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న చేగుంట పోలీసులు

వెల్దుర్తి: సెల్‌ఫోన్లను తరలిస్తున్న కంటైనర్‌లో నుంచి సుమారు రూ.2 కోట్ల విలువైన సెల్‌ఫోన్లు చోరీకి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై సుభాష్‌గౌడ్‌ వివరాల ప్రకారం.. తమిళనాడు నుంచి ఢీల్లీకి సెల్‌ఫోన్లతో వెళ్తున్న కంటైనర్‌ ఈ నెల 16న మండలంలోని మాసాయిపేట వద్ద జాతీయ రహదారిపై ఉన్న దాబా వద్ద నిలిపారు. ఢిల్లీకి వెళ్తున్న క్రమంలో నిర్మల్‌ జిల్లా ఇచ్చోడ వద్ద కంటైనర్‌ తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గమనించిన కంటైనర్‌ డ్రైవర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులకు సమాచారం ఇచ్చారన్నారు. కంటైనర్‌ను పరిశీలించిన ట్రాన్స్‌పోర్ట్‌ నిర్వాహకులు సుమారు రూ.2 కోట్ల విలువ గల సెల్‌ఫోన్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. కంటైనర్‌ డ్రైవర్‌ను ట్రాన్స్‌పోర్ట్‌ నిర్వాహకులు పూర్తి వివరాలు అడుగగా తాను మాసాయిపేట దాబా వద్ద కంటైనర్‌ను నిలుపగా, సెల్‌ఫోన్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. ట్రాన్స్‌పోర్ట్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ మంగళవారం చేగుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.logo