గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు మృతిచెందారు. మృతులను పరందాములు, వెంకటేశ్గా గుర్తింరు. వీరిలో పరందాములు రాయపోల్ పోలీస్ స్టేషన్లో, వెంకటేశ్ దౌల్తాబాద్ పీఎస్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరిద్దరు ఈసీఎల్లో జరుగుతున్న మారథాన్ రన్నింగ్లో పాల్గొనడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కాగా, కానిస్టేబుళ్ల మృతిపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.