Farmers suicide | ముగ్గురు రైతుల బలవన్మరణం
వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు అన్నదాతలు ఒకేరోజు బలవన్మరణాలకు పాల్పడ్డా రు. ఇద్దరు రైతులు అప్పులబాధ తట్టుకోలేక, మరో రైతు అటవీశాఖ అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. జోగుళాం బ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం మద్దూరు గ్రామానికి చెందిన కుర్వ మద్దేశ్వర్ (49) పత్తి, మక్క, ఆముదం పంటలు సాగుచేయగా తీవ్ర నష్టాలొచ్చాయి.
- అప్పులబాధతో ఇద్దరి ఆత్మహత్య
- అటవీశాఖ వేధింపులతో మరొకరు
- గద్వాల, భూపాలపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో వేర్వేరుగా ఘటనలు
వడ్డేపల్లి/కాటారం/వర్ని, ఏప్రిల్ 29: వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు అన్నదాతలు ఒకేరోజు బలవన్మరణాలకు పాల్పడ్డా రు. ఇద్దరు రైతులు అప్పులబాధ తట్టుకోలేక, మరో రైతు అటవీశాఖ అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. జోగుళాం బ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం మద్దూరు గ్రామానికి చెందిన కుర్వ మద్దేశ్వర్ (49) పత్తి, మక్క, ఆముదం పంటలు సాగుచేయగా తీవ్ర నష్టాలొచ్చాయి. అప్పులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెంది 27న రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నా డు. దవాఖానకు తరలించగా చికిత్స పొందు తూ బుధవారం మృతి చెందాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల శివారులోని బొమ్మనగూడేనికి చెందిన రైతు రత్న సంజీవ్(53) తనకున్న రెండెకరాల భూమితోపాటు మరో నాలుగున్నర ఎకరాల కౌలు భూములో పత్తి పంట వేశాడు.
దిగుబడులు రాక, పెట్టుబడుల కోసం తెచ్చిన రూ.5 లక్షలు అప్పు తీరేదారిలేక మనస్తాపం చెందాడు. మంగళవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వరంగల్ ఎంజీఎం లో చికిత్సపొందుతూ బుధవారం మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా వర్ని మండ లం తగిలేపల్లికి చెందిన రైతు పోశెట్టి(48)కి రెండెకరాల పొలం ఉన్నది. సదరు స్థలం అట వీ శాఖదని పేర్కొన్న అధికారులు.. సర్వే త ర్వాత పోశెట్టికి ఎకరం పదహారు గుంటల భూ మిని పట్టా చేసి, మిగతాది అటవీశాఖదని తేల్చారు. దీంతో తనకు చెందిన భూమిలో సాగు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకొంటుండగా, ఫారెస్టు అధికారులు మళ్లీ అడ్డుకోవడంతో మనస్తాపం చెంది ఉరేసుకున్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

