హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎక్కువ సంతానం కలిగిన వ్యక్తులకు కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేసే అర్హత కల్పించాలని జీసీసీ మాజీ చైర్మన్, టీఎస్ స్థానిక సంస్థల ఎన్నికల చట్టం-1995ను రద్దు చేయాలనే డిమాండ్‌తో ఏ ర్పాటైన ఉద్యమ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు అభిమాన్ గాంధీనాయ్ దరావత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని వి ధంగా 1995లో నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రామీణ స్థా నిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం కలిగిన వ్యక్తులు పోటీ చే సేందుకు అనర్హులనే చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఏపీలో ఇప్పుడు ఆ చట్టాన్ని అదే చంద్రబాబు తొలగించారని, తెలంగాణలో కూడా తొలగించాలని విజ్ఞప్తిచేశారు. ఈ చట్టం తొలగింపు అంశంపై సోమవారం నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలని కోరుతూ శనివారం ఆయన తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.