మల్లాపూర్, జూన్ 22: తొలగించిన కరెం టు తీగలు తగిలి విద్యుత్తుషాక్‌తో రెండు బర్రె లు మృతి చెందాయి. ఈ ఘటన శనివారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రం లో జరిగింది. ఈ ఘటనకు వి ద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్థులు బర్రెల కళేబరాలతో సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. బాధితులు, రైతులు, గ్రామస్థులు బర్రెల కళేబరాలను స్థానిక సబ్‌స్టేషన్‌కు తరలించి అందోళన చేపట్టారు.
బాధిత రైతు లకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశా రు. ఎస్సై కిరణ్‌కుమార్, ఏఈ, సిబ్బంది రైతులకు సర్దిచెప్పినా ఫలితం లేదు. చివరికి ఏఈ వినీత్‌రెడ్డి బాధితులకు నెల లోపు నష్ట పరిహారాన్ని అందజేస్తామాని రాతపూర్వక హామీతో ఆందోళన విరమించారు.