భూపాలపల్లి రూరల్, మార్చి 18 : భూపాలపల్లిలో ఫిబ్రవరి 19న జరిగిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో ఏ-8 గా ఉన్న ప్రధాన నిందితుడు కొత్త హరిబాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు భూపాలపల్లి సీఐ నరేశ్‌కుమార్ తెలిపారు.
హత్య కేసులో ప్రధాన నిందితుడు కొత్త హరిబాబు కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఢిల్లీ, జైపూర్, ఆగ్రాలో తనిఖీలు నిర్వహించామని తెలిపారు.