ఖలీల్‌వాడి/మెట్పల్లి/ఖమ్మం వ్యవసాయం, మార్చి 11: మునుపెన్నడూ లేని విధంగా పసుపు రేట్లు ఈ ఏడాది సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. నిజామాబాద్ మార్కెట్లో సోమవారం గరిష్ఠంగా రూ.18,299 ధర పలికింది. గత చరిత్రను తిరగరాస్తూ కొత్త ధర నమోదు కావడం విశేషం.
జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో సోమవారం పసుపు క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.16,205 పలికింది. పసుపు కాడి (కొమ్ము)కు ఈ ధర పలుకడం గడిచిన పదేండ్లలో ఇదే తొలిసారి అని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా మిర్చి గరిష్ఠ ధర సోమవారం రూ.20,650కే పరిమితమైంది. మధ్యరకం ధర రూ.19 వేలు, కనిష్ఠ ధర రూ.13,800 పలికింది. రోజురోజుకూ ధర పతనమవుతుండటంతో రైతులు సరుకును కోల్డ్ స్టోరేజీలకు తరలిస్తున్నారు.