Turmeric | మెట్పల్ల్లి, ఏప్రిల్ 22: జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పసుపునకు రికార్డు స్థాయిలో ధర పలికింది. పసుపు ఉత్పత్తులకు సంబంధించి వివిధ రకాలకు వేర్వేరు ధరలు పలికాయి.
పసుపు కాడి (కొమ్ము) రకానికి క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.16,001, కనిష్ఠంగా రూ.9,111, గోళ (మండ) రకానికి గరిష్ఠంగా రూ. 13,511, కనిష్ఠంగా 9,006, చూర రకానికి గరిష్ఠంగా రూ.11,144, కనిష్ఠంగా 8,911 ధర పలికింది. కాగా ఈ సీజన్లో ఇప్పటివరకు ఇదే అత్యధికం.