మహాదేవపూర్, జూలై 9 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లిలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్‌కు వరద ఉధృతి కొనసాగుతున్నది.
గురువారం 70,140 క్యూసెకుల ప్రవాహంరాగా, బరాజ్‌లోని మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 16.17 టీఎంసీల నిల్వ నీటి సామర్థ్యం ఉన్న బరాజ్ గరిష్ఠ నీటిమట్ట ప్రవాహ ఎత్తు రివర్బెడ్ నుంచి సముద్ర మట్టానికి 100 మీటర్లు కాగా, ప్రస్తుతం 90 మీటర్ల ఎత్తులో ఉన్నదని అధికారులు తెలిపారు.