హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : హెచ్సీయూ విద్యార్థులపై విచక్షణారహితంగా పోలీసులు జరిపిన లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబాలు తెలిపారు. ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. కేంద్ర విద్యాసంస్థలకు చెందిన భూములను వ్యాపార ప్రయోజనాలకు వాడటం అనైతికమని విమర్శించారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్ నయా దేశ్ముఖ్ పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థుల భవిష్యత్తును, వారి హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తున్నదని మండిపడ్డారు. మహిళలు అని కూడా చూడకుండా వారిని దేశద్రోహుల మాదిరిగా ఈడ్చుకెళ్లడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే యూనివర్సిటీలో విద్యార్థులపై చేసిన లాఠీచార్జీని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కిషోర్ తెలిపారు.