హైదరాబాద్, సెప్టెంబర్ 25(నమ స్తే తెలంగాణ) : రాష్ట్రంలో సేంద్రియ సాగుకు ప్రాధాన్యమివ్వనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం సేం ద్రియ సాగుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నేచురల్ ఫార్మింగ్ ద్వారా రైతు ల నికర ఆదాయాన్ని పెంచాలని ఆదేశించారు.
ఇప్పటికే రాష్ట్రంలో 489 క్లస్టర్లు ఏర్పాటుచేసి 61,125 రైతులను ఎంపిక చేసినట్టు తెలిపారు. అంతకుముందు సీడ్మెన్ అసోసియేషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ‘సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా’గా గుర్తిం పు పొందిందని, భవిష్యత్తులో ‘గ్లోబల్ సీడ్ క్యాపిటల్’గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. విత్తనాల తయారీలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు.