హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్, విలువ ఆధారిత పంటలతోనే రైతులు అభివృద్ధి చెందుతారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం ఫ్లోరిడా విశ్వవిద్యాలయ ప్రతినిధుల బృందం మంత్రితో హైదరాబాద్లో భేటీ అయింది.
ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. రైతులకు మార్కెట్ అవకాశాలు విస్తరించే దిశగా అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసేలా అధికారులు, శాస్త్రవేత్తలు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): బడ్జెట్లో రైతుభరోసా నిధులకు కోత పెట్టలేదని, రూ.18వేల కోట్లు కేటాయించినట్టు వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి తెలిపారు.
ఈ మేరకు మార్చి 27న ‘రైతుభరోసా నిధులకు కోత’ శీర్షికన నమస్తే తెలంగాణలో ప్రచురితమైన వార్తకు ఆయన వివరణ ఇచ్చారు. జనరల్ కంపోనెంట్లో రూ.13,603 కోట్లు, ఎస్సీఎస్డీఎఫ్ కింద రూ. 2,769.41 కోట్లు, ఎస్టీఎస్డీఎఫ్ కింద రూ.1,627.59 కోట్లు కలిపి మొత్తం రూ.18వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు.