హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యవసాయ మారెటింగ్ శాఖను సాంకేతిక పరిజ్ఞానంతో మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
మారెటింగ్ శాఖపై శనివారం నిర్వహించిన సమీక్షలో శాఖ పనితీరు, అభివృద్ధి పనులు, డిజిటలైజేషన్, పత్తి కొనుగోళ్ల సన్నద్ధత, ఇంజినీరింగ్ పనులు, మారెట్ యార్డుల్లో సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు, ప్రత్యేక బృందాల తనిఖీలు తదితర అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలోని 206 మారెట్ కమిటీలను పూర్తిస్థాయిలో ఆటోమేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు, టెండర్ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేసి, సెప్టెంబర్ నుంచి అమలు చేయాలని సూచించారు.