ముంబై, సెప్టెంబర్ 16: బంగారు నగలపై హాల్‌మార్కింగ్ చార్జీలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సవరించింది. ఒక్కో గోల్డ్ ఆర్టికల్‌పై ఫీజును రూ.45 నుంచి రూ.75కు పెంచింది. అలాగే కన్సైన్మెంట్ మినిమం చార్జీ రూ.200గా పేర్కొన్నది. అయితే వెండిపై యథాతథంగా రూ.35గానే ఫీజును ఉంచింది. కన్సైన్మెంట్ మినిమం చార్జీ రూ.150.