హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): త్రిపురలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీ టీడీ సిద్ధంగా ఉన్నదని, ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తే ఆలయాన్ని నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని గవర్నర్ నివాసంలో జిష్ణుదేవ్ వర్మను బీఆర్నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ను సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.