హైదరాబాద్, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ) : సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రానుపోను ఒకేసారి టికెట్లు బుక్ చేసుకొంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్టు ప్రకటించింది.
డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్ బస్సుల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్‌కు ఈ రాయితీ వర్తిస్తుందని, వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఇది అమల్లో ఉంటుందని పేర్కొన్నది. ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకొన్నట్టు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.