హైదరాబాద్ : ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇటీవల ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్.. ఆర్టీసీలో తన మార్క్ చూపిస్తున్నారు. మొన్న ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందరికీ ఆదర్శంగా నిలిచిన సజ్జనార్.. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు సజ్జనార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆర్టీసీ బస్సులో బయల్దేరారు. సజ్జనార్ తెలుపు రంగు వస్త్రాలను ధరించారు. తలకు తెలుపు రంగు టోపీ ధరించిన ఆర్టీసీ ఎండీ.. తన చేతుల్లో గణేశ్ ప్రతిమను ఉంచి, భక్తిభావాన్ని చాటుకున్నారు. గణపతి బొప్పా మోరియా నినాదాలతో, డప్పు దరువులతో బస్సు దద్దరిల్లిపోయింది. ఆ బస్సులో ఉన్న భక్తులు కూడా హుషారుగా డ్యాన్స్‌లు చేస్తూ ఎంజాయ్ చేశారు.
గణేష్ నిమజ్జనానికి ఆర్టీసీ బస్సులో బయల్దేరిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ pic.twitter.com/QFrXvKdRFf
— Namasthe Telangana (@ntdailyonline) September 19, 2021