హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): వరుస సెలవుల నేపథ్యంలో వివిధ పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపనున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి చెన్నై, షిర్డీ, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులను నడుపుతామని పేర్కొన్నారు. ప్రయాణికులు వెబ్సైట్ http//tsrtconline. inలో టికెట్లను బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు.
పూర్తి వివరాలకు 040-69440000, 040-23450033 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ నెల 29న సత్తుపల్లి నుంచి అరుణాచలానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సర్వీస్ ప్రారంభంకానున్నదని, మూడు రోజుల్లోఅరుణాలచలంతో పాటు శ్రీకాళహస్తి, కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్ ఆలయాలను సందర్శించవచ్చని తెలిపారు. టికెట్ ధర రూ.3,330 ఉంటుందని పేర్కొన్నారు.