డ్రైవర్ ఆత్మహత్యపై వచ్చిన వార్తలు అవాస్తవం : ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
TSRTC | పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపో డ్రైవర్ రాజయ్య ఆత్మహత్యపై టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. డ్రైవర్ డ్యూటీ మార్చకపోవడమే ఆత్మహత్యకు కారణమన్నది అవాస్తవమని స్పష్టం చేశారు. నిరాధారమైన వార్తలను ఖండిస్తున్నామని
హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపో డ్రైవర్ రాజయ్య ఆత్మహత్యపై టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. డ్రైవర్ డ్యూటీ మార్చకపోవడమే ఆత్మహత్యకు కారణమన్నది అవాస్తవమని స్పష్టం చేశారు. నిరాధారమైన వార్తలను ఖండిస్తున్నామని తెలిపారు. రాజయ్య స్వీయ అభ్యర్థన మేరకే మూడు నెలల క్రితం జేబీఎస్కు బదిలీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. హైదరాబాద్లో కుమారుడు ఉద్యోగం చేస్తున్నాడని, తన కుటుంబం అక్కడే ఉంటోందని, జేబీఎస్కు బదిలీ చేయాలని ఆయనే అభ్యర్థించారు. జేబీఎస్ డ్యూటీని మార్పు చేయమని అధికారులను రాజయ్య ఎప్పుడూ అడగలేదని తెలిపారు.
ఆయన కూతురు గత రెండేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ఆమె ఇటీవల హైదరాబాద్కు వచ్చింది. అయితే డిసెంబర్ 6న ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో పలు ఆలయాల సందర్శనకు ఒక వారం రోజుల సెలవు కావాలని దరఖాస్తు చేసుకోగా, మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అయితే చివరి సారిగా నవంబర్ 23న విధులకు హాజరయ్యాడు. గోదావరిఖనిలోని తన స్వగృహంలో వ్యక్తిగత కారణాలతో రాజయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజయ్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియగానే, గోదావరిఖని డిపో మేనేజర్ ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియల నిమిత్తం టీఎస్ఆర్టీసీ తరుపున స్వయంగా రూ.20 వేలను కుటుంబసభ్యులకు అందజేశారు.
రాజయ్య ఆత్మహత్యకు డ్యూటీ మార్పు కారణమని కుటుంబ సభ్యులు నుంచి ఎలాంటి ప్రస్తావన రాలేదని సజ్జనార్ స్పష్టం చేశారు. డ్యూటీ మార్పు కోసం గోదావరిఖని డిపోలో ఆయన ఎవరినీ సంప్రదించలేదని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, వాస్తవాలను తెలియజేయాలని పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నామని తెలిపారు. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఏకపక్ష వార్తలను ప్రచురించడం సరికాదు. ఇలాంటి వార్తలు ప్రచురించే ముందు సంబంధిత అధికారుల వివరణ తీసుకోవాలని మీడియా సంస్థల ప్రతినిధులను కోరుతున్నామని వీసీ సజ్జనార్ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

