నల్లగొండ: బస్టాండ్లలో అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉన్నాయా? లేదా? అని తెలుసుకునేందుకు స్వయంగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కదిలారు. హైదరాబాద్ నుంచి నల్లగొండకు ఆర్టీసీ బస్సులో ఆయన ప్రయాణించారు. బస్సు దిగిన తర్వాత నల్లగొండ బస్టాండ్లో తనిఖీలు నిర్వహించారు.
అలాగే బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు. బస్టాండ్లో ఉన్న బస్సులను పరిశీలించారు. ఆర్టీసీ సౌకర్యాల గురించి అక్కడ ఉన్న ప్రయాణికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నల్లగొండ బస్టాండ్లో కార్గో సేవలను కూడా పరిశీలించారు. అక్కడే ఆర్టీసీ అధికారులతో సమావేశమయ్యారు.