హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జంట నగరాల పరిధిలో వివిధ ప్రాంతాల నుంచి ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లకు ప్రయాణికులు సులభంగా చేరుకునే ందుకు ఆర్టీసీ కొత్తగా పికప్ వ్యాన్స్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఈసీఐ ఎల్ నుంచి ఎల్బీనగర్ మధ్యలో ఉన్న ప్రాంతాల నుంచి విజయవాడ, విశాఖ పట్నం, కాకినాడ, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు, కందుకూరు రూట్లో వెళ్లే ప్రయాణికుల కోసం ఈ సదుపాయం శుక్రవారం ప్రారంభించారు.040-69440000,040-23450033లకు ఫోన్ద్వారా సంప్రదించాలని తెలిపారు.