హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రాఖీ పౌర్ణమి దృష్ట్యా టీ-9 టికెట్ల అమలును తాతాలికగా నిలిపివేస్తున్నట్టు టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.
మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు ఈ నిలుపుదల ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 2 నుంచి యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.