TSRTC | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్లందరూ తమ విధుల పట్ల ఏ మాత్రం అలసత్వం వహించొద్దని ఆదేశించారు. ప్రమాదాలను నివారించాలని సూచించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు.