హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో పీఈటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బుధవారం నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది.
జూన్ 4వరకు రోజూ రెండు సెషన్లలో వంద మంది చొప్పున వెరిఫికేషన్ కొనసాగుతుందని వెల్లడించింది. వివరాలకు తమ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించింది.