Group-1 Prelims Key | గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ప్రిలిమనరీ కీతో పాటు ఓఎంఆర్ షీట్లను వెబ్సైట్లో ఉంచింది. వీటితో పాటు మాస్టర్ ప్రశ్నపత్రాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ కీలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే జూలై 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆన్లైన్లో తెలియజేయాలని టీఎస్పీఎస్సీ తెలిపింది. అభ్యంతరాలను ఆంగ్లంలో మాత్రమే స్వీకరిస్తామని స్పష్టం చేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాల స్వీకరణ అనంతరం జూలై మొదటివారంలోనే మెయిన్ లిస్టును విడుదల చేసే అవకాశం ఉందని కమిషన్వర్గాలు తెలిపాయి.
కాగా, 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గానూ జూన్ 11వ తేదీన పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు.