TSPSC | గ్రూప్-2 పరీక్షలను రీషెడ్యూల్ చేసిన టీఎస్పీఎస్సీ.. పరీక్షల కొత్త తేదీలివే
TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. నవంబర్ 2,3 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చిన విషయం తెలిసిందే.
TSPSC | గ్రూప్-2 పరీక్ష కొత్త తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించింది. తొలుత.. ఈ నెల 29, 30 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు కమిషన్ ప్రకటించింది. అయితే.. ఈ నెలలోనే గురుకుల పరీక్ష సైతం ఉండడంతో గ్రూప్-2ను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు. అభ్యర్థుల విన్నపంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సానుకూలంగా స్పందించారు. పరీక్షను వాయిదా వేయాలని, తదుపరి తేదీలను ఖరారు చేయాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.
శనివారమే టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్‌తో సీఎస్ సమావేశం నిర్వహించారు. పరీక్ష వాయిదా, కొత్త తేదీల ప్రకటన తదితర అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో.. ఆదివారం నాంపల్లిలోని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ జనార్దన్ రెడ్డి నేతృత్వంలో కమిషన్ సమావేశం జరిగింది. టీఎస్పీఎస్సీ సెక్రటరీతోపాటు సభ్యులు పాల్గొన్నారు. గ్రూప్-2 పరీక్ష కొత్త తేదీలపై కసరత్తు నిర్వహించారు.
ప్రస్తుత పరీక్ష తేదీకి, కొత్త పరీక్ష తేదీకి మధ్య కనీసం రెండు నెలల సమయమైనా ఇవ్వాలని కమిషన్ భావించింది. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ ప్రకటించారు. రెండు రోజులు.. రోజుకు రెండు సెషన్లలో పరీక్ష జరుగుతుందని వెల్లడించారు. పరీక్షకు వారంరోజుల ముందు నుంచి https://www.tspsc.gov.in వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణలో గ్రూప్-2 కేటగిరీ కింద 18 విభాగాల్లో 783 ఉద్యోగాల భర్తీకి గతేడాది నవంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

