AEE exam | హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) రాత పరీక్షకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేసింది. 100 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (అగ్రికల్చర్) పోస్టులకు సోమవారం, 97 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (మెకానికల్) ఉద్యోగాలకు 9న పరీక్ష జరగనున్నది.
21, 22 తేదీల్లో 1,343 సివిల్, ఎలక్ట్రికల్ ఉద్యోగాలకు పరీక్ష జరగనున్నది. 1,540 ఏఈఈ ఉద్యోగాలకు నిరుడు సెప్టెంబర్ 3న నోటిఫికేషన్ రాగా, జనవరి 22న పరీక్ష జరిగింది. ప్రశ్నపత్రాల లీకేజీతో సంస్థ పరీక్షను రద్దు చేసింది. గతంలో అన్నింటికీ ఒకేసారి ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష నిర్వహించగా, నేడు 4దఫాలుగా ఆన్లైన్లో నిర్వహించనున్నారు.