TSPSC | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టులో గ్రూప్2, అక్టోబర్‌లో గ్రూప్-1, నవంబర్‌లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పరీక్షల క్యాలెండర్‌ను బుధవారం టీఎస్పీఎస్సీ అధికారులు విడుదల చేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో నిరుద్యోగులను ప్రసన్నం చేసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. దీంతో ఆగమేఘాల మీద పరీక్షల తేదీలను ఖరారు చేసినట్టు సమాచారం. 563 ఉద్యోగాల భర్తీకి ఇటీవల విడుదల చేసిన గ్రూప్1 నోటిఫికేషన్‌కు సంబంధించి జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు.