హైదరాబాద్, అక్టోబర్ 20(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ హయాంతో పోల్చితే బీఆర్ఎస్ హయాంలో ఇసుకపై ఆదాయం 149% పెరిగిందని ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు. ములుగు పర్యటనలో కాంగ్రెస్ నేత రాహుల్ ఇసుక విధానంపై చేసిన ఆరోపణలను ఖండించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మాట్లాడేముందు వాస్తవా లు తెలుసుకోవాలని హితవు పలికారు. కాంగ్రె స్ హయాంలో ఇసుకపై 39.66 కోట్ల ఆదా యం సమకూరితే, ప్రస్తుతం ఈ ఆదాయం 5,901.73 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.
ఇసుక విధానం సరిగా లేకుంటే లేకపోతే ఇం త ఆదాయం ఎలా వ స్తుందని ప్రశ్నించారు. ప్రజలకు ఇసుక దొరకకుండా కాంగ్రెస్ ప్రజలను ఇబ్బంది పెడితే, సీఎం కేసీఆర్ ఇసక కొరత రాకుండా చూసుకున్నారని తెలిపారు. తెలంగాణ ఇసుక విధానంపై కేంద్రం సహా పలు రాష్ర్టాలు ప్రశంసలు కురిపించాయని తెలిపారు. ఇక్కడి ఇసుక విధానంపై ఏడు రాష్ర్టాలు అధ్యయనం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే రాహుల్ మాత్రం ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివి నోటికొచ్చిన విమర్శలు చేసి వెళ్లిపోయారని క్రిశాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.