గురువారం 28 మే 2020
Telangana - May 23, 2020 , 23:51:13

టీఎస్‌ఐపాస్‌ దేశానికి రోల్‌మోడల్‌

టీఎస్‌ఐపాస్‌ దేశానికి రోల్‌మోడల్‌

  • అన్ని రాష్ర్టాల్లో అమలుతో పెట్టుబడుల వెల్లువ
  • కొటక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఎండీ నీలేశ్‌ షా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన టీఎస్‌ఐపాస్‌ దేశానికి రోల్‌మోడల్‌గా నిలుస్తున్నదని కొటక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఎండీ నీలేశ్‌ షా ప్రశంసించారు. కరోనా నేపథ్యంలో చైనా నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న ఇతర దేశాల కంపెనీలను ఆకర్షించడానికి టీఎస్‌ఐపాస్‌ను దేశమంతా అమలుచేయాలని సూ చించారు. శనివారం ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో ‘ఇన్వెస్టర్‌ కాన్ఫిడెన్స్‌ బిల్డింగ్‌ మెజర్స్‌ పోస్ట్‌ కొవిడ్‌-19’ అంశంపై నిర్వహించిన వెబినార్‌లో నీలేశ్‌ షా మాట్లాడుతూ.. టీఎస్‌ఐపాస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో 15 రోజుల్లో అనుమతులిచ్చేలా అన్ని రాష్ట్రాలు అమలుచేస్తే మంచి ఫలితాలు ఉంటాయని, చైనానుంచి తరలించే కంపెనీలు భారత్‌ వైపు చూస్తాయని అభిప్రాయపడ్డారు. దేశం ఆర్థికంగా పుంజుకొనేందుకు బంగా రు నిల్వలను వాడుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రస్తుత పరిస్థితుల నుంచి దేశం బయటపడేందుకు వైద్యపరమైన పరిష్కారాలు, ఆర్థిక ప్రోత్సాహం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉన్నదని ఆయన చెప్పారు. కరోనా ఆరోగ్యపరంగా, ఆర్థికంగానూ ప్రభావాన్ని చూపిందని ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు కరుణేంద్ర జాస్తీ పేర్కొన్నారు.


logo