హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు ప్రజలకు పిలుపునిచ్చారు. రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని ఈసీ ఫిర్యాదు చేసి కాంగ్రెస్ తన నీచ బుద్ధిని బయట పెట్టుకున్నదని గురువారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు పంట పెట్టుబడి సాయం అందకుండా చేస్తున్నదని, రైతులు కన్నీరు పెడుతుంటే దాన్ని చూసి పైశాచిక ఆనందం పొందడం కాంగ్రెస్ పార్టీ నైజమని మండిపడ్డారు.