హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ సాధన ఉద్యమానికి హైకోర్టు ఉద్యోగులు మద్దతు పలికారు. శనివారం హైకోర్టు ఆవరణలో నిర్వహించిన హైకోర్టు సర్వీస్ అసోసియేషన్ సమావేశంలో సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ, ఈ నెల 12న నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించినట్టు చెప్పారు.
ఇటీవలే 16 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పాత పెన్షన్ సాధన సంకల్పరథయాత్రను నిర్వహించామని తెలిపారు. సమావేశంలో సీపీఎస్ఈయూ రాష్ట్రప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, నిశాంత్‌రెడ్డి, ఖాద్రి, ప్రశాంత్‌రెడ్డి, వెంకటేశ్, సతీశ్, నరేందర్‌రావు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.