Monsoon | తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రాగల మూడురోజుల్లో ప్రాంతాలకు విస్తరించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే ఐదు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
శుక్రవారం నుంచి శనివారం వరకు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో, శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యర్మ్రాల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. 25 నుంచి 26వ తేదీ వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.
ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. 26 నుంచి 27వ తేదీ ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని హెచ్చరించింది.