Lawcet Results | జూన్ 5న లాసెట్ ఫలితాలు.. ఈ సారి ప్రవేశ పరీక్షకు సెలబ్రెటీలు!
Lawcet Results | లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్, పీజీ లాసెట్ ఫలితాలు జూన్ 5న విడుదల కానున్నాయి. లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలను సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు.
Lawcet Results | హైదరాబాద్, మే 18 (నమస్తేతెలంగాణ) : లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్, పీజీ లాసెట్ ఫలితాలు జూన్ 5న విడుదల కానున్నాయి. లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలను సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఈ నెల 23న ప్రాథమిక ‘కీ’ విడుదల చేస్తారు. 25 వరకు ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు వ్యక్తంచేయవచ్చు.
లాసెట్‌కు 66,864 మంది దరఖాస్తు చేసుకోగా, 54,374 మంది (81.32%) అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మూడేండ్ల లా కోర్సుకు 80%, ఐదేండ్ల లా కోర్సుకు 83%, ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాలు కల్పించే పీజీ లాసెట్‌కు 83% చొప్పున అభ్యర్థులు హాజరైనట్టు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బీ విజయలక్ష్మి తెలిపారు.
రాష్ట్రంలోని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, వీఐపీలు లా కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, గాయని కల్పన, యాంకర్ కనకాల సుమ, బుల్లితెర నటుడు విజయ్‌రెడ్డి, బల్వీర్‌సింగ్(జబర్దస్త్ ఫేమ్)తో పాటు పలువురు యూట్యూబర్లు లాసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. యాంకర్ సుమ సోమవారం నిర్వహించిన పరీక్షకు గైర్హాజరైనట్టు సమాచారం.
మంత్రి సీతక్క ఎల్ఎల్ఎం కోర్సు ప్రవేశ పరీక్ష రాశారు. సీతక్క ఇప్పటికే ఎల్ఎల్ఎం కోర్సు పూర్తిచేయగా, మరోసారి పీజీ లాసెట్ పరీక్షకు హాజరయ్యారు. రిటైర్డ్ ఉద్యోగులు, డాక్టర్లు, రాజకీయ నాయకులు లా కోర్సుల్లో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాసి పోటీపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

