Inter Exams | రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష జరగనుంది. దీంతో ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. నిమిషం నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులు ఉరుకులు పరుగుల మీద ఎగ్జామ్ హాలుకు చేరుకున్నారు. ఉదయం 9 గంటల తర్వాత పరీక్షా కేంద్రానికి వచ్చిన విద్యార్థులను అధికారులను అనుమతించలేదు. కాగా, ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9.47 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.

Inter Exams2
ఈసారి ఇంటర్ పరీక్షలు అత్యధిక మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో రాస్తున్నారు. 9.47 లక్షల మంది విద్యార్థుల్లో 8.40 లక్షల మంది ఇంగ్లిష్ మీడియంలోనే హాజరవుతున్నారు. ఫస్టియర్లో 4.32 లక్షలు, సెకండియర్లో 4.09 లక్షలు ఇంగ్లిష్ మీడియంలో రాస్తుండగా, తెలుగు మీడియం ఫస్టియర్లో 45,376, సెకండియర్లో 50,673 విద్యార్థులు హాజరుకాబోతున్నారు. ఉర్దూ మీడియంలో ఫస్టియర్లో 4,544, సెంకడియర్లో 4,667 విద్యార్థులు హాజరవుతున్నారు. మరాఠీలో 198, హిందీలో 70, కన్నడలో 18 మంది పరీక్షలు రాయనున్నారు.


Inter Exams3

Inter Exams4

Inter Exams5

Inter Exams6