హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షల తేదీలను ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ ప్రకటించారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకూ ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి.
విద్యార్థులు హాల్ టికెట్లను tsbie.cgg.gov.in వెబ్సైటు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. హాల్ టికెట్లలో ఏమైనా పొరపాట్లు ఉండే వెంటనే కాలేజి ప్రిన్సిపాల్ లేదా జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ అధికారి దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.
మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న హల్ టిక్కెట్‌పై ప్రిన్సిపాళ్ల సంతకం లేకుండా కూడా చెల్లుబాటు అవుతాయని ఒమర్ జలీల్ పేర్కొన్నారు.