తొర్రూరు, నవంబర్ 6: ‘కాంగ్రెస్ నాయకుల హామీలతో మోసపోయినం.. ప్రభుత్వం వచ్చి 11 నెలలైనా హామీలు అమలు చేయకపోవడంతో గోసపడుతున్నం’ అని గుడిబండతండా రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుడిబండ తండాకు బుధవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెళ్తుండగా తండా రైతులు ఆయన వాహనాన్ని ఆపి సమస్యలను ఏకరువు పెట్టారు.
ధా న్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500 బోనస్ ఇవ్వకపోగా, కనీసం మద్దతు ధర కూడా ఇస్తలేదని తెలిపా రు. అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తమని చెప్పగానే మోసపోయి ఓట్లేశామన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లితో పలువురు రైతులు మాట్లాడిన వివరాలు ఇలా…
రైతు: క్వింటాల్‌కు రూ.2050 సార్
రైతు: ప్రైవేట్ వాళ్లు వచ్చి కూడా తీసుకొని పోతాండ్రు. వీళ్లేమో వడ్లు తడిసినయ్.. తేమ ఎక్కువ ఉందని కొంటలేరు.
రైతు: మా దగ్గర ధాన్యం కేంద్రాలు ఓపెన్ చేయలేదు. ప్రైవేట్ వ్యాపారులే కొంటాండ్రు.
రైతు: వడ్ల సెంటర్లు ఓపెన్ చెయ్యనే లేదు. ఏం చేయాలె సారు.
మరో రైతు: రైతుబంధు ఇస్తలేదు.. బోనస్ రూ.500 ఇస్తరనే నమ్మకం లేదు.
మరో రైతు: కాదు సార్.. తాలుతోనే మాకు తూకంలో కలిసి వస్తుంది. అదే మాకు లాభం సార్.
మహిళ రైతు: మాకు అంతా లాసే రుణమాఫీ లేదు. రైతుబంధు లేదు.. సార్
రైతు: మీకెట్ల వేస్తిమో వాళ్లకు అట్లే వేసినం సారు.
మరో రైతు: కాదు సార్, ఒకేసారి రుణమాఫీ చేస్తే ఏమీ కాకపోవు.
మహిళ రైతు: రైతుబంధే వస్తలేదు. రూ.2,500 ఎక్కడ ఇస్తాండ్లు సారు.