TS Elections Code | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు ఇలా అనుమానం వచ్చినవారందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కోడ్ అమలులోకి వచ్చిన దాదాపు పది రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా రూ.165కోట్లకుపైగా సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న తరలిస్తున్న నగదు, బంగారు వెండి ఆభరణాలతో పాటు ఇతర వస్తువులను పెద్ద ఎత్తున పట్టుబడుతున్నది. బుధవారం వరకు రూ.165.81కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.77.87కోట్లు నగదు, రూ.8.99కోట్ల విలువైన మద్యం, రూ.7.55కోట్ల విలువ పట్టుకున్న విలువ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే తనిఖీల్లో రూ.62.73కోట్ల బంగారు వెండి ఆభరణాలతో పాటు రూ.8.64కోట్ల విలువైన ఇతర వస్తువులు, ఉచిత కానుకలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు. అయితే, ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వివిధ అవసరాల నిమిత్తం భారీగా నగదును వెంట తీసుకెళ్లే సమయంలో డబ్బుకు సంబంధించి ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు డబ్బు, మద్యం, ఇతర వస్తుసామగ్రి పంపిణీ చేసి ఓటర్లను మభ్యపెట్టకుండా ఈసీ కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఎన్నికల నిబంధనల ప్రకారం.. రూ.50వేలకు నగదును తరలిస్తున్న సమయంలో పోలీసులకు పట్టుబడితే తప్పనిసరిగా ఆ నగదు మొత్తానికి సంబంధించిన ఆధారాలు సంబంధిత అధికారులకు సమర్పించాలి ఉంటుంది. లేనిపక్షంలో ఆ నగదును సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించే అధికారం తనిఖీ చేస్తున్న అధికారులు ఉంటుంది. ఈసీ ఆదేశాలతో అధికారులు పెద్ద ఎత్తున ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, స్టేట్ ఇంటర్నల్ బోర్డర్ చెక్‌పోస్టులు, మొబైల్ పార్టీలను అధికారులు ఏర్పాటు చేశారు. ఆయాబృందం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా అడ్డుకట్ట వేస్తున్నది.